ధనుష్ కు అండగా నిలిచిన రామ్‌చరణ్
కిడ్నీవ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడి పరిస్థితి చూసి హీరో రామ్‌చరణ్ చలించిపోయారు. వైద్యసాయం అందించి బాలునికి అండగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా షూటింగ్ గోదావరి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ నెలలో శివగిరిలో షూటింగ్ జరుగుత్ను సమయంలో కొందరు అభిమానులు రామ్‌చరణ్‌ను చూడడానికి వచ్చి ఫొటోలు తీయించుకున్నారు. ఈ సమయంలో పశ్చిమగోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన ఎం.సత్యనారాయణ, అతడి భార్య తమ ఇద్దరు పిల్లలను తీసుకుని రామ్‌చరణ్ వద్దకు వచ్చారు. ఫొటో తీయించుకున్న తర్వాత తమ మూడున్నరేళ్ల బిడ్డ ధనుష్‌కు కిడ్నీ సమస్య ఉందనే విషయాన్ని చెప్పారు. దీంతో చలించిపోయిన రామ్‌చరణ్ ఆ బిడ్డను ఎత్తుకుని ఆడించారు. వ్యాది తగ్గడానికి అవసరమైనన వైద్యం తాను చేయిస్తానని చెప్పడమే కాకుండా హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ బాలుని ఆరోగ్య పరిస్థితి కాస్త మెరగడంతో ధనుష్ తల్లిదండ్రులు ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా కుమారేదవంవద్ద షూటింగ్స్పాట్కు వచ్చి రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.













