ఫామిలీ మ్యాన్-౩ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్…
ఫామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండు సీజన్స్ ఎంత హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. బ్రాండ్ సిరీస్ గా అమెజాన్ ప్రైమ్ లో చాలా ఫేమస్ అయ్యింది ఈ వెబ్ సిరీస్. ఈ మధ్య కాలం లో ఎన్నో వెబ్ సిరీస్లు వచ్చాయి , వెళ్లాయి. కానీ ఫామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యం లో ఫామిలీ మ్యాన్ -౩ వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేసినట్టు ఇప్పటికే ప్రకటించారు.
ఈ వెబ్ సిరీస్ సీజన్-౩ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మనోజ్ బాజ్ పాయి తాజాగా ఈ సిరీస్ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసారు. ఫామిలీ మ్యాన్-౩ వెబ్ సిరీస్ మొదలు పెట్టడానికి అమెజాన్ సిద్ధంగా ఉందని, అయితే దర్శకులు రాజ్ – డీకే లతో పాటు తను కూడా ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీ గా ఉన్నామని ఆయన తెలిపారు.
ఈ ఏడాది చివరి వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని, వచ్చే ఏడాది ప్రారంభం లో సీజన్-౩ ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఫామిలీ మ్యాన్ సిరీస్ అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నట్లు నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సీజన్ ౩ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఎన్ని సార్లు అడిగినా సరైన సమాధానం ఇవ్వలేదు.
ఇప్పుడు మనోజ్ బాజ్ పాయ్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ తో ఫాన్స్ ఫుల్ ఖుషీ అయినట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ లో పాత నటీనటులతో పాటు మరి కొంత మంది కొత్త ఆర్టిస్ట్స్ కూడా భాగమవుతున్నట్టు సమాచారం. ఇప్పటివరకు సమంత, మనోజ్ బాజ్ పేయ్ ల పేర్లు మాత్రమే అమెజాన్ అధికారికంగా ప్రకటించింది.
అయితే ఈ సిరీస్ తెరకెక్కడానికి డిలే అవుతుండడంతో , మనోజ్ సిరీస్ నుండి తప్పుకున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. తాజాగా మనోజ్ ఈ సిరీస్ గురించి అప్డేట్ ఇవ్వడంతో ఆయన తన పాత్రలోనే కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో పలు సినిమాలలో బిజీగా ఉన్నారు. అలాగే సమంత కూడా అనారోగ్యానికి గురి కావడంతో విశ్రాంతి లో ఉన్నారు. ఆమె కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని డాక్టర్స్ చెప్పగా, ఇప్పటికే సైన్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఎక్కడికక్కడ ఆగిపోయిన విషయం తెలిసిందే.













