ఒక్క సీన్‌తో ఫ్యామిలీలను కట్టిపడేసిన భగవంత్ కేసరి
ఈ రోజుల్లో బయట మృగంలా ప్రవర్తిస్తున్న మగాళ్లు ఎక్కువైపోయారు. తమ కామానికి వరుస, వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చిన్న పాప నుంచి కాటికి పోయే ముసలి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇలాంటి సంఘటనలు మనం నిత్యం వింటూనే ఉన్నాం. టీవీల్లో చూస్తూనే ఉన్నాం.
బాలయ్య రీసెంట్ సినిమా భగవంత్ కేసరిలో ఈ సెన్సిటివ్ సీన్ గురించి చెప్పిన తీరు అందరితో చప్పట్లు కొట్టిస్తోంది. సెకండాఫ్ వచ్చే కీలక ఎపిసోడ్లో బాలయ్య ఓ స్కూల్‌కు వెళ్లి పిల్లలు తమ చిన్నతనం నుంచే తమకు ఎదురయ్యే లైంగిక స్పర్శలకు ఎలా స్పందించాలనేదానిపై మాట్లాడిన తీరు అందరి గుండెలకు హత్తుకుంటుంది.
ఆఖరికి తండ్రి అయినా సరే కొన్ని చోట్ల పట్టుకుంటే తప్పని చెప్పే హక్కు ఉందని, వెంటనే ఆ విషయాన్ని తల్లికి చెప్పాలని బాలయ్య చెప్పిన విధానం అందరినీ ఇంప్రెస్ చేసింది. ఇలాంటి సెన్సిటివ్ టాపిక్‌ను అనిల్ రావిపూడి చాలా స్ట్రయిట్‌గా బాలయ్యతో చెప్పించాడు. వాస్తవానికి ఈ సీన్ రాసుకుంది శ్రీలీల క్యారెక్టర్ ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్ అవడానికే అయినా సీన్ తర్వాత కాసేపైనా తల్లిదండ్రుల మనసులు భావోద్వేగంతో నిండిపోవడం ఖాయం. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా అందరూ ఈ సీన్ గురించి మాట్లాడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సీన్ కు ఆడియన్స్ ఎంతలా కనెక్ట్ అయ్యేరనేది.













