మళ్ళీ వాయిదా
హీరో నిఖిల్ వివాహం రెండోసారి వాయిదా పడిరది. భారత ప్రభుత్వం లాక్ డౌన్‌ను మే 17 వరకు పొడిగించిన నేపథ్యంలో మరోసారి తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు నిఖిల్. ఏప్రిల్ 16న నిఖిల్, డా. పల్లవిల వివాహం జరగాల్సి ఉంది. లాక్డౌన్ కారణంగా వారి వివాహం వాయిదా వేసుకున్నారు. అప్పుడు నిఖిల్ మాట్లాడుతూ ‘‘మా ఫ్యామిలీ మెంబర్స్, మా బంధువులు అందరూ పెళ్ళి వాయిదా పడినందుకు చాలా డిజప్పాయింట్ అయ్యారు. కానీ, ప్రపంచమంతా కరోనా వంటి భయంకరమైన వైరస్‌తో పోరాడుతుంటే మేం మా పెళ్ళిని ఎలా సెలబ్రేట్ చేసుకోగలం? అందుకే మా పెళ్లిని వాయిదా వేసుకోవాలని నేను, పల్లవి నిర్ణయించుకున్నాం. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఆ తర్వాత వీరి వివాహం మే 14న జరుగుతుందని ప్రకటించారు. అయితే మరోసారి లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించడంతో రెండోసారి నిఖిల్, పల్లవిల వివాహం వాయిదా పడింది.













