ఎక్స్ట్రా పై టీమ్ సూపర్ కాన్ఫిడెంట్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్లో వస్తున్న యూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. అందులో భాగంగా హీరో నితిన్, డైరెక్టర్ వక్కంతం వంశీ, రావు రమేష్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.
ఎక్స్ట్రా మూవీలో రావు రమేష్, నితిన్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్, తన మధ్య వచ్చిన సీన్స్ చాలా కొత్తగా ఉంటూనే అలరిస్తాయని, మధ్య తరగతి తండ్రి పాత్రలో తను చేసిన క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని రావు రమేష్ చెప్పుకొచ్చాడు. తన 20 ఏళ్ల కెరీర్లో ఈ క్యారెక్టర్, ఈ సినిమా ఎంతో స్పెషల్ అని నితిన్ చెప్పుకొచ్చాడు.
నితిన్, రావు రమేష్ ఎక్స్ట్రా గురించి ఇంతలా చెప్తున్నారంటే సినిమాలో మ్యాటర్ ఉందని అర్థమవుతుంది. వక్కంతం వంశీ కూడా ఎక్స్ట్రా సినిమా కిక్, రేసు గుర్రం సినిమాల మాదిరి ఎంటర్టైన్ చేస్తుందని తెలిపాడు. మొత్తానికి చిత్ర యూనిట్ మొత్తం ఎక్స్ట్రా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. దానికి తోడు ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ పాత్ర చేస్తున్నాడు. తన క్యారెక్టర్ సినిమాలో చాలా కీలకం కానుందని అంటున్నారు. ఎక్స్ ట్రా మూవీ విజయం నితిన్ కు, వక్కంతం వంశీకి చాలా అవసరం.













