రోహిత్ మౌనం వెనుక పెద్ద ప్లానే ఉందిగా!
నారా రోహిత్ హీరోగా టీవీ5 మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రతినిధి2. అప్పుడెప్పుడో సినిమాను అనౌన్స్ చేశారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా మౌనం పాటిస్తున్నారు మేకర్స్. అయితే ఈ మౌనం వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వాతావరణం చాలా హీటెక్కి ఉంది.
జనసేన- టీడీపీ పొత్తు తర్వాత సిట్యుయేషన్స్ కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తున్నా, జనవరి నుంచి అసలైన రాజకీయ వేడి కనిపించడం ఖాయం. వీటిన్నింటినీ బాగా గమనించి దానికి అనుగుణంగా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడట మూర్తి. ఆర్జీవీ చేసిన వ్యూహం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సినిమా టోటల్కు ఫేవర్ గా ఉంటుందన్నది తెలిసిందే.
అందుకే వ్యూహం మూవీని చూసి, అందులోని అంశాలకు టార్గెట్ గా కొన్ని అంశాలను ప్రతినిధి2లో జోడించే ఆలోచన చేస్తున్నాడట మూర్తి. వ్యూహం2ని కూడా జనవరి 25కి రిలీజ్ చేస్తారు. అదే టైమ్ కు ప్రతినిధి2ని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు రోహత్. ఏదేమైనా సరే ఈ సినిమా గురించి పెద్దగా హడావిడి చేయకుండా సైలెంట్ గా వచ్చి ప్రమోషన్స్ తో వేడి పెంచాలని, కంటెంటే సినిమాను మాట్లాడిస్తుందని చాలా నమ్మకంగా ఉన్నారు ఇటు రోహిత్, అటు మూర్తి. మరి ప్రతినిధి2 ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













