Udayabhanu: అన్నీ బయటపెడతా.. ఆ రోజు యుద్ధాలు ఖాయం

తెలుగమ్మాయిగా బాగా ఫేమస్ అయిన యాంకర్ ఉదయభాను(Udayabhanu) మొన్నా మధ్య ఓ భామ అయ్యో రామ(O bhama Ayyo rama) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో యాంకర్లు సిండికేట్ గా ఏర్పడ్డారని భాను చేసిన కామెంట్స్ పై ఆమె తాజాగా మరోసారి స్పందించింది. ఉదయభాను నటించిన త్రిబాణధారి బార్బరిక్(Tribanadhari Barbarik) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ విషయంపై మాట్లాడింది.
తాను ఆ రోజు చాలా జోక్ గానే ఆ మాటను అన్నానని, కానీ తాను చెప్పింది మాత్రం నిజమేనని, ఇండస్ట్రీలో ఎన్నో జరుగుతున్నాయని, తనను తొక్కేసే వాళ్లు ఎక్కువయ్యారని, కొన్నిసార్లు మొత్తం రెడీ అయిపోయి ఈవెంట్ కు వెళ్లాక ఆ ఛాన్స్ వేరే వాళ్లకు ఇచ్చామని చెప్తారని, దాంతో చేసేదేమీ లేక వెనక్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయని, తన డేట్స్ ను తీసుకుని ఆ తర్వాత మినిమం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండానే తనను తీసేసేవాళ్లని ఉదయభాను చెప్పింది.
కెరీర్లో చాలా బాధలు పడి, ఈ స్థాయికి వచ్చానని, ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలన్నింటినీ త్వరలోనే బయటపెడతానని, ఆ రోజు చాలా పెద్ద యుద్ధాలే జరుగుతాయని, తనకు జరిగిన ప్రతీ అన్యాయాన్ని అందరికీ తెలిసేలా చేస్తానని, అలా చేస్తేనే నెక్ట్స్ జెనరేషన్స్ కు ఓ ఐడియా ఉంటుందని ఉదయభాను తెలిపింది. దీంతో ఈ వ్యాఖ్యలు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి.