రహస్యంగా పెళ్లి చేసుకున్న.. ఎవలిన్ శర్మ

ప్రభాస్ నటించిన సాహో లో మెరుపు లాంటి అతిథి పాత్రలో ఆకట్టుకున్న బ్యూటీ ఎవలిన్ శర్మ. ఈ భామ ఆస్ట్రేలియాకి చెందిన తన బెస్ట్ ఫ్రెండ్ తుషార్ భిండిని గత నెలలో రహస్యంగా వివాహమాడింది. 2019లో నిశ్చితార్థం చేసుకున్న తుషన్, ఎవెలిన్ అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో కొవిడ్ నియమ నిబంధనలతో ఈ ఏడాది మే 15న వివాహం చేసుకుంది. తాజాగా ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇప్పుడు ఎవలిన్ తమ పెళ్లి విషయాన్ని బయటకు తెలియజేసింది. ఇది క్రైస్తవ సంప్రదాయాలకు అనుగుణంగా జరిగిన వివాహ వేడుక అని విడుదలైన పోటోలు చెబుతున్నాయి. ఈ ఫొటోల్లో ఎవలిన్ తెల్లని గౌనులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కాగా వరుడు ఆస్ట్రేలియాలో ప్రముఖ వైద్యుడని తెలిసింది.