త్వరలోనే మళ్లీ బుల్లితెరపైకి ఎన్టీఆర్
గత కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెర రంగాన్ని శాసిస్తున్న స్టార్ మా రియాలిటీ షో స్ తో ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ లో టాప్ లోనే ఉంటుంది. ఇటీవల కాలంలో స్టార్ మా సక్సెస్ కు మెయిన్ రీజన్స్ లో ఒకటి బిగ్ బాస్ షో. మంచి టీఆర్పీలతో రికార్స్ క్రియేట్ చేస్తున్న స్టార్ మా ను ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచించిన జెమినీ ఇప్పుడు సరికొత్త ప్లాన్ తో బరిలోకి దిగనుంది.
ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షో ని జెమినీ టీవీ తెరపైకి తీసుకురానుంది. దీని కోసం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఈ షో కి హోస్ట్ గా బరిలోకి దించడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. మొదట్లో బిగ్ బాస్ తెలుగు సీజన్1 కు హోస్టింగ్ చేసిన ఎన్టీఆర్ మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులు కు హోస్టింగ్ చేయనున్నారు. దీంతో జెమినీకి టీఆర్పీల విషయంలో ఢోకా ఉండదని అందరూ అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ షో కు ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నాడనే విషయాన్ని జెమినీ వారు వెల్లడించకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. త్వరలోనే తారక్ పేరును జెమినీ టీవీ బిగ్ బ్యాంగ్ తో అనౌన్స్ చేస్తారని అంటున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ దీని తర్వాత త్రివిక్రమ్ తో తన కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీ చేయనున్నాడు. వీటితో పాటు బుల్లి తెరపై తారక్ రీ ఎంట్రీ అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత తమ ఫేవరెట్ హీరోని బుల్లి తెరపై చూడటం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆక్తిగా వెయిట్ చేస్తున్నారు.













