‘ఎరుపు పసుపు పచ్చ’ ఫస్ట్ లుక్ విడుదల
విజయ్ ఆంటోనీతో ‘పిచైకారన్’ (తెలుగులో ‘బిచ్చగాడు’) సినిమాని రూపొందించి అందర్నీ తనవైపు తిప్పుకున్న దర్శకుడు శశి. హీరో సిద్ధార్థ్, మ్యూజిక్ డైరెక్టర్ కం హీరో జీవీ ప్రకాష్ లీడ్ యాక్టర్స్ గా నటించిన తమిళ చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చై’. ‘బిచ్చగాడు’ తర్వాత శశి దర్శకత్వం వహించిన నెక్స్ట్ ఫిలిం ఇదే. ఈ సినిమాను ‘ఎరుపు పసుపు పచ్చ’ అనే టైటిల్ తో తెలుగు లో రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల దర్శకుడు శంకర్ చేతుల మీదుగా విడుదల అయింది. పోస్టర్ని బట్టి చూస్తుంటే సిద్ధార్థ్ పోలీస్ ఆఫీసర్‌గా, జీవీ ప్రకాశ్ స్ట్రీట్ రేసర్‌గా కనిపించనున్నాడని తెలుస్తుంది.













