కోటి తనయుడు రాజీవి 11:11 మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ బై .. రామ్ పోతినేని
గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా 11:11 సినిమాను రూపొందిస్తున్నారు నిర్మాత గాజుల వీరేష్ (బళ్లారి). కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా రాబోతున్న ఈ సినిమాను టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. RK నల్లూరి దర్శకత్వం వహిస్తుండగా సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉన్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా టిప్స్ మ్యూజిక్ ద్వారా ఓ యూత్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. హీరో రామ్ చేతుల మీదుగా విడుదల చేసిన ఈ పాట ఏమయ్యిందో మనసైపోయే మాయం అంటూ యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది.
పాటలో హీరోహీరోయిన్లపై షూట్ చేసిన సన్నివేశాలతో పాటు కోటి అందించిన మ్యూజిక్ మేజర్ హైలైట్ అయ్యింది. తన ప్రేయసి ప్రేమ కోసం ప్రియుడు తన ఫీలింగ్స్ బయటపెడుతున్నట్లు ఈ సాంగ్ రాశారు రాకేండు మౌళి. ఈ సాంగ్ విడుదల చేసిన అనంతరం సాంగ్ చాలా బాగా వచ్చిందని తెలిపారు హీరో రామ్. ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెబుతూ సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఈ 11: 11 చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, దగ్గుబాటి రానా చేతులమీదుగా వదిలిన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచాయి.
తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్ సినిమా పట్ల ఆసక్తి పెంచేసింది. హీరో రాజీవ్ సాలూర్- హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్, అందులో అనూహ్యంగా ఎంటరైన ఓ వ్యక్తి, అతన్ని హతమార్చడం అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది. అతిత్వరలో ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్. సీనియర్ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా రూపొందుతోన్న చిత్రం 11: 11. ఈ చిత్రాన్ని గాజుల వీరేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఓ యూత్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘ఏమయ్యిందో మనసైపోయే మాయం..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను ఉస్తాద్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని విడుదల చేశారు. చిత్రం సక్సెస్ కావాలని యూనిట్‌కు అభినందనలు తెలిపారు. సీనియర్ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా రూపొందుతోన్న చిత్రం 11: 11. ఈ చిత్రాన్ని గాజుల వీరేష్ నిర్మిస్తున్నారు.
RK నల్లూరి దర్శకత్వం వహిస్తుండగా సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూత్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘ఏమయ్యిందో మనసైపోయే మాయం..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను ఉస్తాద్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని విడుదల చేశారు. తనయుడు రాజీవ్ సినిమాలోని మేజర్ మ్యూజిక్ కోటి సంగీతం అందించటం విశేషం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీత సారథ్యాన్ని వహించారు. తన ప్రేయసి ప్రేమ కోసం ప్రియుడు తన ఫీలింగ్స్ బయటపెడుతున్నట్లు ఈ సాంగ్ రాకేందు మౌళి రాశారు. ఈ సాంగ్ విడుదల చేసిన హీరో రామ్ పోతినేని.. సినిమా పెద్ద హిట్ కావాలని చిత్రయూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఇప్పటికే 11: 11 చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, దగ్గుబాటి రానా చేతులమీదుగా వదిలిన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
హీరో రాజీవ్ సాలూర్- హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్, అందులో అనూహ్యంగా ఎంటరైన ఓ వ్యక్తి, అతన్ని హతమార్చడం అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది. అతిత్వరలో ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్. ఇప్పటికే రాజీవ్ సాలూరి హీరోగా టైటానిక్, చిన్ని చిన్ని ఆశ, ఓరి దేవుడోయ్, ఆకాశమే హద్దు వంటి పలు చిత్రాల్లో హీరోగా మెప్పించే ప్రయత్నం చేశారు. మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తోన్న రాజీవ్ సాలూరికి ఈ చిత్రం ఎలాంటి సక్సెస్‌ను అందిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.













