ఇప్పుడు ఈషా అదే రూట్
హారర్ సినిమాల మీద హీరోయిన్లు మోజు తక్కువేం కాదు. ఇప్పుడు ఈషా అదే రూట్ పట్టింది. రెగ్యులర్ లవ్ స్టోరీస్‌తో ముందుకు సాగిన వరంగల్ బ్యూటీ, కెరీర్ బ్రేక్ కోసం హారర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ థ్రిల్లర్ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తాడట. శ్రీనివాసరెడ్డి ఈషా కోసం ఒక మంచి కథను రెడీ చేశారట. నిజానికి నాగచైతన్యతో సినిమా చేసేందుకు శ్రీనివాసరెడ్డి చాలాకాలం ప్రయత్నించినా వర్కవుట్ కాకపోవడంతో ఆ ప్రాజెక్టును పక్కనపెట్టి హారర్ కథతో ఈషాను సంప్రదించాడట. కథ నచ్చి ఈషా వెంటనే ఓకే చెప్పిందని అంటున్నారు. హారర్ థ్రిల్లర్తోనైనా అనుష్క, నయనతార వంటి టాప్ హీరోయిన్లలా మంచి బ్రేక్ సాధించాలని భావిస్తోంది ఈషా.













