ఆశించిన ఫలితం దక్కలేదు
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత భారీ వసూళ్లతో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో తారక్ డబుల్ హాట్రిక్ కొట్టి దూసుకుపోతున్నాడు. ఈ సినిమాలో నటించిన పూజాహెగ్డే, జగపతిబాబు, నవీనచంద్ర, శత్రులకు మంచి పేరు వచ్చింది. కానీ ఇందులో నటించిన హీరోయిన్ ఈషా రెబ్బాకు మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ భామ పాత్ర మూడు, నాలుగు సన్నివేశాలకు మాత్రమే పరిమితమైంది. వాస్తవానికి ఈషాపై ఎక్కువ సన్నివేశాలను చిత్రీకరించారు. కానీ సినిమా నిడివి ఎక్కవ కావడంతో దర్శకుడు త్రివిక్రమ్ ఈషారెబ్బా ఉన్న సీన్లను ఎడిటింగ్‌లో తొలగించాడట. దీంతో ఈ భామకు అనుకున్నంతగా పేరు రాలేదు. ప్రస్తుతం ఈషా కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ చిత్రంలో హీరోయిన్ చేస్తోంది. కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ గోపాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంపై ఈషా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రంతోనైనా ఆమె కన్నడంలో పెద్ద హిట్‌ను అందుకుంటుందా అనేది చూడాలి.













