ఈ అమ్మాయి చిత్రం ప్రారంభం
బిగ్‌బాస్, ఏడుచేపల కథ ఫేం భానుశ్రీ ప్రదానపాత్రలో దొంతం రమేష్ దర్శకుడిగా పరిచయమౌతూ తెరకెక్కిస్తున్న ఈ అమ్మాయి చిత్రం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమానంలో ప్రారంభమైంది. శ్రీఅవధూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దొంతు బుచ్చయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మూహూర్తపు సన్నివేశాన్ని నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎస్విఎస్ రావు క్లాప్‌నివ్వగా, పారిశ్రామికవేత్త చెరుకూరి సూధాకర్ రాజు స్విచ్చాన్ చేశారు. అనంతరం చిత్ర దర్శకుడు దొంతు రమేష్ మాట్లాడుతూ ఈ అమ్మాయి చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ఈనెల చివరి నుంచి ప్రారంభించి సింగిల్ షెడ్యూల్లో పూర్తిచేస్తామన్నారు. జనవరి 23న ఆడియో రిలీజ్ చేసి ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. చిత్ర నిర్మాత దొంతు బుచ్చయ్య మాట్లాడుతూ వివిధ దశల్లో అమ్మాయిలు ఎదుర్కొనే రకరకాల సమస్యల్ని కథాంశంగా తీసుకొని చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు.













