ఈగల్ కు కమల్ మూవీకు లింక్
రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా జనవరి 13న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. సంక్రాంతికి ఎన్నో సినిమాలు బరిలో ఉన్నప్పటికీ తమ సినిమా కచ్ఛితంగా రిలీజవుతుందంటూ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పదే పదే క్లారిటీ ఇస్తూ వస్తోంది. కానీ సంక్రాంతి బరిలో ఉన్న అన్ని సినిమాల్లో కల్లా బజ్ తక్కువున్న సినిమా అంటే ఇదే.
అందుకే ఈగల్ కు ప్రమోషన్స్ ద్వారా హైప్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఈగల్ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈగల్ మూవీకి, కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన విరుమాండి మూవీకి పోలిక తీసుకొచ్చాడు. ఆ సినిమాలో ఎలాగైతే టిపికల్ స్క్రీన్ ప్లే ఉంటుందో, ఈగల్ లో కూడా అలాంటి స్క్రీన్ ప్లే నే ఉంటుందని కార్తీక్ వెల్లడించాడు.
ఈగల్ సినిమాలో క్యారెక్టర్ల మధ్య పాయింట్ ఆఫ్ వ్యూని సడెన్ గా మార్చడం ద్వారా ఆడియన్స్ కు ఓ కొత్త అనుభూతి కలగనుందని కార్తీక్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. రవితేజ నుంచి ఆడియన్స్ ఆశించే మాస్ ను మిస్ చేయకుండానే ఈ ప్రయోగాన్ని చేసినట్లు కార్తీక్ తెలిపాడు. మరి సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలతో పాటూ రిలీజవుతున్న ఈగల్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.













