‘ఈ 2 మనసులు’ టీజర్ విడుదల
శేఖర్ మూవీస్ బ్యానర్‌పై చంద్రశేఖర్.ఎస్ నిర్మించిన చిత్రం ఈ2 మనసులు. అది పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం లవ్ అండ్ ఫ్యామిలి సెంటిమెంట్‌తో తెరకెక్కుతోంది. రవిచంద్ర, సుమయ నాయిక నాయకులుగా పరిచయమవుతున్నారు. చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఫిబ్రవరిలో చివరిషెడ్యూల్ పూర్తిచేసుకుని వేసవిలో ఈ చిత్రం మీ ముందుకు రానుంది. ఈ సందర్భంగా టీజర్‌ను, పాటలను విడుదల చేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఇది ఒక లవ్‌స్టోరీ. మీ అందరికి తప్పకుండా నచ్చుతుందన్నారు. నిర్మాత మాట్లాడుతూ అందరూ కొత్తవాళ్లే అయినా సినిమా బాగా వచ్చిందన్నారు. హీరో మాట్లాడుతూ ఇటీవల వచ్చిన లవ్‌స్టోరీలకు భిన్నంగా ఉంటుంది అని అన్నారు. తప్పకుండా సినిమాని అందరూ చూసి అదరించాలని కోరుకుంటున్నాం అన్నారు.













