బాలయ్య సినిమాలో దుల్కర్ పాత్ర అదేనా?
మలయాళ ఇండస్ట్రీతో పాటూ తమిళ, తెలుగు భాషల్లో కూడా మంచి క్రేజ్ అందుకుంటున్న మీరో దుల్కర్ సల్మాన్. బాలీవుడ్ నుంచి కూడా దుల్కర్ కు ఛాన్స్ లు వస్తున్నాయి. కానీ చాలా ఆలోచించి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. రీసెంట్గా తెలుగులో దుల్కర్‌కు మంచి హిట్స్ వచ్చాయి.
మహానటి సినిమాతో టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్న దుల్కర్ సీతారామం సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో తెలుగులో దుల్కర్ మార్కెట్ పెరిగింది. రీసెంట్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టిన దుల్కర్, బాలకృష్ణ-బాబి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఓ కీ రోల్ చేయనున్నాడని టాక్ వచ్చింది.
తెలుగులో హీరోగా మంచి ఛాన్సులు వస్తున్న తరుణంలో దుల్కర్ బాలయ్య సినిమాలో ఎలాంటి రోల్ చేస్తున్నాడనేది అందరికీ ఆసక్తిగా మారింది. ఇంతకీ ఈ సినిమాలో దుల్కర్ చేస్తుంది పాజిటివ్ పాత్రనా లేక నెగిటివ్ పాత్రనా అన్నది క్లారిటీ రాలేదు కానీ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఇందులో దుల్కర్ నెగిటివ్ షేడ్ మరొకవైపు పాజిటివ్ షేడ్ ఉండేలా బాబీ ఆ క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తన పాత్ర కొత్తగా ఉండటం వల్లే దుల్కర్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.













