బాలయ్య మూవీలో మలయాళ నటుడు
ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో మంచి హిట్ అందుకున్న బాబీ, తన తర్వాతి సినిమాను నందమూరి బాలకృష్ణతో చేయనున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. రీసెంట్‌గానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. మహానటితో టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న దుల్కర్, తర్వాత్తర్వాత తన సినిమాలతో మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. స్ట్రయిట్ మూవీ అయినా, డబ్బింగ్ మూవీ అయినా సరే తన డబ్బింగ్ చెప్పుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు.
అందుకే టాలీవుడ్ ఆడియన్స్ దుల్కర్ ను అమితంగా ఇష్టపడతున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిమానం చూసిన దుల్కర్, టాలీవుడ్ నుంచి ఎలాంటి క్రేజీ ఆఫర్ వచ్చినా నో చెప్పకుండా దాని గురించి ఆలోచించి, నిర్ణయం తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే బాలయ్య సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది .ఈ సినిమా కోసం ఇప్పటికే హనీ రోజ్, చాందిని చౌదరిని కూడా ఫైనల్ చేశారంటున్నారు.













