Dulqer Salman: దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulqer Salman) అద్భుతమైన స్క్రిప్ట్ సెలెక్షన్స్ తో ఎప్పుడూ యూనిక్ కథలు, చాలెంజింగ్ రోల్స్ తో అలరిస్తున్నారు. తన 41వ చిత్రం #DQ41 కోసం దుల్కర్, నూతన దర్శకుడు రవి నేలకుదిటితో చేతులు కలిపారు. లవ్ స్టొరీ తో పాటు అద్భుతమైన హ్యుమన్ డ్రామా గా రూపొందనున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు. ఇది నిర్మాణ సంస్థ 10వ వెంచర్. #SLV10 మైల్ స్టోన్ గా నిలుస్తుంది.
ఈ రోజు హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ముహూర్తపు షాట్‌కు నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టారు. దర్శకుడు బుచ్చి బాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, గుణ్ణం సందీప్, నాని, రమ్య గుణ్ణం స్క్రిప్ట్‌ను టీంకు అందజేశారు. ఫస్ట్ షాట్‌ను రవి నెలకుడిటి స్వయంగా దర్శకత్వం వహించారు.
దసరా, ది ప్యారడైజ్ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం అవుతుంది.
మలయాళం, తెలుగు సినిమాల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్ లాంటి హీరోని ఒప్పించడం మామూలు విషయం కాదు. దర్శకుడు రవి నెలకుడిటి ఒక అద్భుతమైన కథ, కాన్సెప్ట్ తో దుల్కర్ ని ఇంప్రెస్ చేశారు.
హై ప్రొడక్షన్ అండ్ టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు, జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, తమిళ భాషలలో పాన్ ఇండియా విడుదల కానుంది.







