Kaantha: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సెల్వమణి సెల్వరాజ్, రానా దగ్గుబాటి ‘కాంత’ సాంగ్

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ బైలింగ్వల్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’ (Kantha) నవంబర్ 14న రిలీజ్ కానుంది. 1950మద్రాస్, సినిమా గోల్డెన్ ఏజ్ బ్యాక్ డ్రాప్ రూపొందుతున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాంత అద్భుతమైన ప్రేమకథతో పాటు మూవీ వరల్డ్ కి ట్రిబ్యూట్.
భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి సంయుక్తగా నిర్మిస్తున్నారు.
టీజర్, ఫస్ట్ సింగిల్‌తో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు అమ్మడివే సాంగ్ ని విడుదల చేశారు. ఝాను చంథర్ కంపోజ్ చేసిన ట్రాక్ వింటేజ్ ఆర్కెస్ట్రేషన్ తో ఆకట్టుకుంది. కృష్ణకాంత్ సాహిత్యం, ప్రదీప్ కుమార్ వోకల్స్ ఎమోషనల్ గా హత్తుకున్నాయి. అమ్మడివే క్లాసిక్ రొమాన్స్ లవర్స్ కి ఇన్స్టంట్ గా కనెక్ట్ అవుతుంది.
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ వింటేజ్ లవ్ స్టొరీని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ డానీ సాంచెజ్ లోపెజ్, ఆర్ట్ డైరెక్షన్‌ను థా. రామలింగం. అదనపు స్క్రీన్‌ప్లేను తమిళ్ ప్రభ ఇచ్చారు. లెవెలిన్ ఆంథోనీ గోన్సాల్వెస్ ఎడిటర్.