కల్కిలో దుల్కర్, మృణాల్ పాత్రలవే..!
నెక్ట్స్ వీక్ రిలీజ్ కానున్న కల్కి 2898ఏడీ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటూ సగటు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నాడని ఎన్నో అంచనాలున్నాయి. ఇప్పటికే కల్కికి సంబంధించిన రెండు ట్రైలర్లను మేకర్స్ రిలీజ్ చేసి సినిమా గురించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.
కల్కి సినిమాలో ట్రైలర్ లో చూపించని ఎన్నో సర్ప్రైజ్లు ఉన్నాయని తెలుస్తోంది. అందులో మెయిన్ సర్ప్రైజ్ సీతారామం జోడీ దుల్కర్, మృణాల్. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరూ సినిమాలో కల్కి తల్లిదండ్రులుగా కనిపిస్తారని అంటున్నారు. విష్ణుయశస్, సుమతిలుగా ఎంతో ప్రాధాన్యమున్న పాత్రల్లో వీరు కనిపిస్తారట.
ఆ పాత్రలు సినిమాలో కనిపించేది కాసేపే అయినా ఆ సన్నివేశాలను దర్శకుడు నాగ్ అశ్విన్ గుర్తుండిపోయేలా డిజైన్ చేశాడని తెలుస్తోంది. ఒకవేళ కల్కి ప్రభాస్ అయితే మాత్రం ఈ ఎపిసోడ్ హైలైట్ కావడం ఖాయం. వీరితో పాటూ సినిమాలో నాని, విజయ్ దేవరకొండ, రాజమౌళి కూడా కల్కి లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి జూన్ 27న థియేటర్లలో నాగ్ అశ్విన్ ఇచ్చే సర్ప్రైజ్లకు ఆడియన్స్ మతి పోవడం ఖాయమని టాక్.













