Dubbing Movies: నెక్ట్స్ వీక్ ను టార్గెట్ చేసిన డబ్బింగ్ సినిమాలు
తెలుగులోకి ఎన్నో డబ్బింగ్ మూవీస్ వస్తున్నప్పటికీ వాటిలో కొన్నే హిట్లుగా నిలుస్తాయి. ఈ వారం ఆది పినిశెట్టి(Aadhi pinisetty) హీరోగా నటించిన శబ్ధం(Shabdham) మూవీతో పాటూ దాంతో పోటీ పడుతూ అగాథియా(Agathiya) అనే డబ్బింగ్ మూవీ కూడా రిలీజైంది. ఇదిలా ఉంటే తెలుగులో నెక్ట్స్ వీక్ మొత్తాన్ని డబ్బింగ్ సినిమాలు కబ్జా చేసేశాయి.
మార్చి 7న తెలుగులో మూడు వేర్వేరు భాషల నుంచి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో మొదటిది హిందీలో భారీ హిట్ గా నిలిచి, వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఛావా(Chhava). ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్ గా రూపొందిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ఛావాతో పాటూ కోలీవుడ నుంచి జీవీప్రకాష్ కుమార్(GV Prakash Kumar) నటించిన ఫాంటసీ హారర్ర్ కింగ్స్టన్(Kingston) రిలీజ్ కానుంది. కమల్ ప్రకాష్(Kamal Prakash) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జీవీ ప్రకాష్ కు జోడీగా దివ్య భారతి(Divya bharathi) హీరోయిన్ గా నటించింది. వీటితో పాటూ మల్లూవుడ్ లో మంచి కలెక్షన్లు అందుకుంటున్న ఆఫీసర్ ఆన్ డ్యూటీ(Officer On Duty) మూవీ కూడా వచ్చే వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ జిత్తు అష్రఫ్(Jithu Ashruf) దర్శకత్వంలో రూపొందింది. మరి ఈ మూడు సినిమాల్లో ఏ మూవీ పెద్ద హిట్ గా నిలుస్తుందనేది చూడాలి.













