డ్యూయల్ రోల్లో అఖిల్?
ఏజెంట్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న అక్కినేని అఖిల్ తన తర్వాతి సినిమా కోసం చాలానే గ్యాప్ తీసుకున్నాడు. అఖిల్ తన తర్వాతి సినిమాను అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో చేయనున్న విషయం తెలిసిందే. అనిల్ గతంలో రాధేశ్యామ్, సాహో లాంటి సినిమాలకు పని చేశాడు. యువి క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా నిర్మాణంలో యువి క్రియేషన్స్ తో పాటూ హోంబలే ఫిల్మ్స్ కూడా యాడ్ అయినట్లు తెలుస్తోంది. సలార్ తో మంచి హిట్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్ ఇకపై అన్ని భాషల్లో సినిమాలు చేయాలనుకుంటుంది. అందులో భాగంగానే ఈ సినిమా లో యువి తో జత కట్టినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్స్ ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. సినిమాను అధికారికంగా అనౌన్స్ చేయడమే తరువాయి. ఈ సినిమాలో అఖిల్ డ్యూయల్ రోల్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి మాస్ లుక్ లో ఉంటే, మరొకటి స్టైలిష్ లుక్ లో వైలెంట్ గా ఉంటుందని సమాచారం. ఈ సినిమాతో తనలోని టాలెంట్ ను బయటపెట్టాలని అఖిల్ కూడా ఈ మూవీ కోసం తెగ కష్టపడుతున్నాడని తెలుస్తోంది.













