‘డిటియస్’ మూవీ ప్రారంభం
కొత్త కాన్సెప్ట్‌తో యంగ్ టీంతో డిటియస్ మూవీ ప్రారంభం లాంఛనంగా జరిగింది. ఇప్పటి వరకు తెలుగు తెరమీద చూడని కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీలో ఆశిష్ గాంధీ, పూజా జవేరి జంటగా నటిస్తున్నారు. శ్రీ భవిత క్రియేషన్స్ బ్యానర్లో నూతన దర్శకుడు అభిరామ్ పిల్లా దర్శకత్వంలో రూపొందబోయే ఈ మూవీ ప్రారంభం ప్రొడక్షన్ ఆఫీస్‌లో చిత్రయూనిట్ సమక్షంలో జరిగింది. ఈ సందర్భగా నిర్మాత గంగారెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ చివరి వారంలో షూటింగ్ కి వెళుతున్నాం. రెండు షెడ్యూల్స్‌లో సినిమా కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేసాము. అభిరామ్ కాన్సెప్ట్ వినగానే చాలా కొత్తగా గ్రిప్పంగ్గా అనిపించింది. మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. మా ప్రయత్నానికి ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని నమ్ముతున్నాం అన్నారు.













