శేఖర్ కమ్ముల సినిమాకు దేవీశ్రీ
సింపుల్ స్టోరీలను తీసుకుని వాటికి తనదైన మార్క్ లో ఎమోషన్స్ యాడ్ చేసి, నటీనటుల పెర్ఫార్మెన్స్ మీదే కంటెంట్ ఆడాలని చూసే డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకడు. అందుకే లవ్ స్టోరీ, ఫిదాలో మనకు నాగచైతన్య, వరుణ్ తేజ్ కంటే మధ్య తరగతి అబ్బాయిలే కనిపిస్తారు. అలాంటి శేఖర్ కమ్మలు ఇప్పుడు తన కొత్త సినిమా విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ధనుష్ తో శేఖర్ కమ్ముల చేయబోయే సినిమాకు క్యాస్టింగ్, టెక్నికల్ సపోర్ట్ విషయంలో హంగులు జోడిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున కూడా ఉండటంతో ఇది మల్టీస్టారర్ గా తెరకెక్కబోతుంది. అందుకే ఈ సినిమా రేంజ్ మొదట్లోనే పాన్ ఇండియాకు చేరింది. మామూలుగా అయితే శేఖర్ కమ్ముల ఎప్పుడూ తన సినిమాలకు ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకోడు.
అలాంటిది ఇప్పుడు ధనుష్ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ ను తీసుకోవాలని చూస్తున్నాడట. దీని వెనుక చాలానే కారణాలున్నాయి. ధనుష్ మూవీ అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మ్యూజిక్ పై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఆడియో కంపెనీలు కూడా బ్రాండింగ్ ను చూస్తాయి కాబట్టి దేవి కి ఓటేస్తున్నారు దర్శకనిర్మాతలు. అంతేకాకుండా తమిళంలో దేవీకి మంచి గుర్తింపు కూడా ఉంది. కాబట్టి ఎటు చూసినా ఈ సినిమాకు దేవీనే బెస్ట్ అని మేకర్స్ ఫీలవుతున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.













