కూతురి కోసం తల్లి దర్శకత్వం?
జీవిత-రాజశేఖర్ల పెద్ద కుమార్తె శివాత్మికను హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం చేయాలనే ప్రయత్నం తాత్కాలికంగా ఆడటం తెలిసిందే. వెంకట్ డైరెక్షన్లో 2 స్టేట్స్ చిత్రం ద్వారా శివాత్మికను పరిచయం చేయడానికి చేసిన ప్రయత్నం కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. అడివిశేష్, శివాత్మిక జంటగా సినిమా షూటింగ్ మొదలైనా, దర్శకుడు హీరో మధ్య తలెత్తిన విభేదాల వల్ల ఆగిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాత్మిక తొలి సినిమాను ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు జీవిత రాజశేఖర్ ప్రయత్నిస్తున్నారు. డైరెక్షన్లో అనుభమున్న జీవితే 2 స్టేట్స్ రీమేక్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల హడావుడి తరువాత జీవిత దర్శకత్వలో ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కొచ్చు.













