శేఖర్ తో మళ్లీ మొదలెట్టారు
రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా శేఖర్. మ్యాన్ విత్ ద స్కార్ అనేది ఉపశీర్షిక. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్. పెగాసన్ సినీ కార్స్ పతాకాలపై ఎమ్.ఎల్.వి.సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. అరకులో తాజా షెడ్యూల్ మొదలైంది. దీంతో 75 శాతం చిత్రీకరణ పూర్తి కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ రాజశేఖర్ గారి 91వ చిత్రమిది. ఇప్పుడు ఈ అరకు షెడ్యూల్ తో 75 శాతం సినిమా పూర్తవుతుంది. సుమారు 20 రోజుల పాటు, నెలాఖరు వరకు అరకులో షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత హైదరాబాద్లో ఐదు రోజులు షూటింగ్ చేశాక.. శ్రీశైలం లేదా నాగార్జున సాగర్లో వారం షెడ్యూల్ ప్లాన్ చేశాం అని అన్నారు. దర్శకుడు లలిత్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణకు విరామం వచ్చింది. ఈ రోజు అరకులో చిత్రీకరణ పున ప్రారంభించాం. ఇందులో హీరో రాజశేఖర్ గారితో పాటు హీరోయిన అను సితార, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటారు. కీలక సన్నిశేశాలను తెరకెక్కించడానికి ప్లాన్ చేశాం. రాజశేఖర్ గారి సరసన మరో కథానాయికగా జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్ కుబ్ చాందిని నటిస్తున్నారు అని అన్నారు.













