పవర్ఫుల్ గెటప్‌లో రాజశేఖర్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 8న ఎక్స్ట్రా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు చిత్ర బృందం రీసెంట్గా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేసింది.
ఇందులో భాగంగానే రీసెంట్గా రాజశేఖర్ ఎక్స్ట్రా సెట్స్ లోకి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. క్యారెక్టర్ ప్రధానంగా సాగనున్న ఈ సినిమాలో రాజశేఖర్ పోషిస్తున్న పాత్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందని మూవీ టీమ్ తెలిపింది. ఈ సినిమాలో యాంగ్రీ మెన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.
తన నటనతో, డైలాగులతో యాంగ్రీ యంగ్‌మెన్ గా క్రేజ్ తెచ్చుకున్న రాజశేఖర్ కు ఎక్స్ట్రా సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా గరుడవేగ, కల్కి లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని బాగా అలరించారు. ఆయన నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా శేఖర్. ఈ సినిమా తర్వాత ఆయన మరో సినిమా చేసింది లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా సినిమాలో ఆయనకు మంచి గుర్తింపు దక్కితే ఆయన కెరీర్ మారిపోవడం ఖాయమనుకోవచ్చు.













