Coolie: కూలీ రికార్డుపై సందేహాలు
రజినీకాంత్(rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్(lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కూలీ(coolie). గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నాగార్జున(nagarjuna), ఉపేంద్ర(upendra), ఆమిర్ ఖాన్(aamir khan), శృతి హాసన్(shruthi Hassan), సౌబిన్ షాహిర్(Soubin shahir) కీలక పాత్రల్లో నటిస్తుండటంతో ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలున్నాయి. దానికి తోడు తాజాగా రిలీజైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాల్ని విపరీతంగా పెంచేసింది.
ఆగస్ట్ 14న కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ పూర్తి చేసుకున్న కూలీ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో ఈ సెన్సార్ రిపోర్ట్ పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తుంది. ఈ రిపోర్టు తో కూలీ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ రావడం చాలా వరకు తగ్గుతుంది.
పైగా కోలీవుడ్ లో ఈ సినిమా మొదటి రూ.1000 కోట్ల సినిమాగా నిలుస్తుందని అందరూ ఎంతో ఆశగా ఉన్నారు. సినిమాకు A సర్టిఫికెట్ వచ్చిన నేపథ్యంలో ఇది జరుగుతుందా అని అనుమానపడుతున్నారు. దానికి తోడు ఇప్పటివరకు A సర్టిఫికెట్ వచ్చిన ఏ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరింది లేదు. మరి కూలీ రూ.1000 కోట్లు కలెక్ట్ రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.







