డబుల్ ఇస్మార్ట్ లేట్ కు కారణమదేనా?
పూరీ జగన్నాథ్ సినిమాలంటే ఒకప్పుడు ఎప్పుడు మొదలయ్యాయో అందరికీ తెలిసే లోపు సినిమాను థియేటర్లలోకి దింపేవాడు. అంత ఫాస్ట్ గా సినిమాలు తీస్తుంటాడు పూరీ. టాలీవుడ్ మొత్తం మీద అత్యంత వేగంగా సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేసే డైరెక్టర్ గా పూరీకి స్పెషల్ గుర్తింపు ఉంది. ఇలా ఫాస్ట్ గా తీయడం వల్ల పూరీకి టైమ్ సేవింగ్ పక్కన పెడితే ఫ్లాపులు కూడా ఎక్కువ అవుతున్నాయి.
అలా కాకుండా పూరీ కాస్త టైమ్ తీసుకుని రాజీ పడకుండా సినిమా చేస్తే మంచి రిజల్ట్ వస్తాయని ఫ్యాన్స్ తో పాటూ పూరీ భార్య సైతం చెప్తూ ఉంటుంది. అందరూ చెప్పింది పూరీకి ఇప్పుడు వినిపించిన్నట్లుంది అందుకే తన తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్ విషయంలో పూరీ బాగా లేట్ చేస్తున్నాడు. లేదంటే ఈ పాటికి పూరీ సినిమాను రిలీజ్ కూడా చేసి ఉండేవాడు.
పూరీ సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ హిట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమాను హిట్ చేసి, లెక్కలన్నింటినీ సరి చేయాల్సిన బాధ్యత డబుల్ ఇస్మార్ట్ పైనే ఉంది. అందుకే తనేం తీశాడో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ది బెస్ట్ అనుకున్న అవుట్పుట్ తోనే ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డబుల్ ఇస్మార్ట్ లేటవుతున్నట్లు తెలుస్తోంది.













