డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఇంకా అవలేదా?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ అవడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజవాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతుంది. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఎక్కువ భాగం అక్కడే జరుగుతుంది.
సినిమాకు సంబంధించిన కీలక సీన్స్ ను అక్కడ షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ మరో పది రోజుల పాటూ ముంబైలోనే జరగనుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కూడా పాల్గొంటున్నాడు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం ఈ సినిమాకు కీలకం కానుంది. ఇస్మార్ట్ శంకర్ కు మణిశర్మ మ్యూజిక్కే ప్రాణం పోసింది.
ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ తో మరోసారి మణి అలాంటి మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు. మరో రెండ్రోజుల్లో ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ అప్డేట్ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ రానుంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య థాపర్ నటిస్తోంది.













