బజ్ పెంచాలి పూరీ!
రీసెంట్ గా రిలీజైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ విషయంలో రామ్ ఫ్యాన్స్ సముఖంగా ఉన్నప్పటికీ మిగిలిన ఆడియన్స్ కు మాత్రం ఆ టీజర్ పెద్దగా ఎక్కలేదు. రెగ్యులర్ గా సినిమాలు చూసే ఆడియన్స్ కూడా ఈ సినిమా గురించి ఎంతో ఊహించుకున్నామని, కానీ ఇస్మార్ట్ శంకర్ టెంప్లేట్ ను వాడి దానికి సంజయ్ దత్ విలనిజాన్ని, అలీ కామెడీని జోడించారని కామెంట్స్ చేస్తున్నారు.
మరో వర్గం ఆడియన్స్ మాత్రం టీజర్ లోని మాస్ కంటెంట్ బాగా నచ్చిందని, టీజర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసిందని చెప్తున్నారు. కానీ మెజారిటీ మాత్రం కంప్లయింట్స్ బ్యాచ్ ఎక్కువగా ఉంది. వీటన్నింటినీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఇవే తర్వాత ప్లాన్ చేయబోయే ప్రమోషన్స్ కు కీలకం కానున్నాయి. లైగర్ ఎఫెక్ట్ నుంచి బయటపడటానికి పూరీకి ఉన్న ఆప్షన్ డబుల్ ఇస్మార్ట్ మూవీనే. అది జరగాలంటే డబుల్ ఇస్మార్ట్ పైన ఆడియన్స్ తో సినిమా పట్ల విపరీతమైన ఎగ్జైట్మెంట్ కలిగేలా చేయాలి. అంతే కానీ రోటీన్ పదాలతో మ్యాజిక్ జరగాలంటే అది అస్తమానం వర్కవుట్ అవదు. ఇలాంటి సినిమాలకు ప్రీ రిలీజ్ బజ్ చాలా అవసరం. ఆ బజ్ ను క్రియేట్ చేయడంలో ఏ మాత్రం తడబడ్డా ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్ పై పడుతుంది. ఏదేమైనా డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ విషయంలో పూరీ మరిన్ని జాగ్రత్తలు తీసుకుని బజ్ పెంచితే తప్ప తను అనుకున్న రిజల్ట్ ను చూడలేడు.













