డబుల్ ఇస్మార్ట్ కి పాన్ ఇండియా కళ
రామ్, పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న పూరీకి ఈ సినిమా సక్సెస్ మంచి బూస్టప్ ఇచ్చింది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ఇచ్చిన జోష్‌లో పూరీ తర్వాత విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాడు.
కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో పూరీకి ఛాన్సులు రావడం మానేశాయి. ఛాన్స్‌లు రాని పూరీకి, రామ్ మరోసారి డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనుంది. అంతేకాదు ఈ మూవీ ముంబై నేపథ్యంలోనే ఎక్కువగా కొనసాగనుందని, షూటింగ్ కూడా ఎక్కువ భాగం ముంబైలోనే జరగనుందని తెలుస్తోంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మ్యూజిక్ అందించిన మణిశర్మనే డబుల్ ఇస్మార్ట్ కు సంగీతం అందిస్తాడనుకున్నారు కానీ పూరీ ఈ సినిమా కోసం ఓ హిందీ మ్యూజిక్ డైరెక్టర్‌ను సెట్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇదే కానీ జరిగితే డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా రేంజ్లో బజ్ తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.













