డబుల్ ఇస్మార్ట్ బడ్జెట్ ఎంతంటే?
ఇస్మార్ట్ శంకర్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చాడనుకున్న పూరీ, విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేసి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను తన అకౌంట్ లో వేసుకున్నాడు. రొటీన్ స్టోరీతో క్యారెక్టర్స్ మార్చి పాన్ ఇండియా అప్పీల్ యాడ్ చేసి తెరకెక్కించిన సినిమా వల్ల విజయ్ కెరీర్ కు కూడా బాగా డ్యామేజ్ జరిగింది. అప్పటి వరకు విజయ్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ మొత్తం లైగర్ సినిమాతో పోయింది.
దీంతో ఛాన్స్ లు లేక పూరీ సైలెంట్ అయ్యాడు. తనకు ఇస్మార్ట్ శంకర్ రూపంలో హిట్ ఇచ్చిన రామ్ పోతినేనితోనే మరో సినిమా చేయడానికి పూరీ స్టోరీని రెడీ చేసుకున్నాడు. డబుల్ ఇస్మార్ట్ పేరుతో సినిమాకు అనౌన్స్ చేశారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కబోతుందంటూ అనౌన్స్మెంట్ రోజే చెప్పారు.
సినిమా ఇంకా మొదలు కూడా పెట్టలేదు కానీ వచ్చే ఏడాది మార్చి 8న సినిమాను రిలీజ్ చేస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం బోయపాటి తో సినిమా చేస్తున్న రామ్, ఆ సినిమా అయిపోగానే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. పూరీ దర్శకత్వంలో రానున్న సినిమాలో రామ్ అండర్ కవర్ కాప్ గా కనిపించనున్నాడని టాక్.
ఇదిలా ఉంటే ఈ సినిమాని ఛార్మీ ఏకంగా 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లైగర్ సినిమాకే తమ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మరీ సినిమాను తీశామని చెప్పిన ఛార్మీ, మరి ఇప్పుడు ఇస్మార్ట కోసం 40 కోట్లను ఎక్కడ నుంచి తీసుకొస్తుందని అందరూ అంటున్నారు.













