డబుల్ ఇస్మార్ట్‌లో హైలైట్ అదేనట
లైగర్ సినిమాతో ఘోరమైన ఫ్లాప్ అందుకున్న పూరీ జగన్నాథ్, ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ సినిమాను రామ్ పోతినేనితో చేస్తున్నాడు. వారిద్దరి కాంబోలో వచ్చిన హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కిస్తున్నాడు పూరీ. శంకర్ పాత్రను మాత్రమే కొనసాగిస్తూ మిగిలిన కథ మొత్తాన్ని పూరీ ఛేంజ్ చేసినట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్ తో ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. సంజయ్ దత్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. పవర్ఫుల్ మాఫియా డాన్ గా సంజయ్ డబుల్ ఇస్మార్ట్ లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ ను నెవర్ బిఫోర్ అనేలా పూరీ తెరకెక్కిస్తున్నాడట.
అసలు ఎవరూ ఊహించని విధంగా ఈ సీక్వెన్స్ ఉండబోతుందని సమాచారం. ఈ సీక్వెన్స్ లోనే రామ్ లోని రెండో క్యారెక్టర్ బయటకు రావడంతో పాటూ, హీరోయిన్ తో లవ్ స్టోరీకి సంబంధించిన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సీన్ ను ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్ అయ్యేలా పూరీ డిజైన్ చేశాడట. డబుల్ ఇస్మార్ట్ మొత్తానికి ఈ ఇంటర్వెల్ సీన్ హైలైట్ కానుందని యూనిట్ వర్గాలంటున్నాయి. అయితే డబుల్ ఇస్మార్ట్ హిట్ అటు రామ్‌కు, ఇటు పూరీకు ఎంతో కీలకం కానుంది.













