డబుల్ ఇస్మార్ట్ వస్తున్నాడంటే పుష్ప రానట్టేనా?
పుష్ప2 వాయిదా పడుతుందని ఓ వైపు వార్తలొస్తుండగా, మరోవైపు ఆ డేట్ ను లాక్ చేసుకోవడానికి పలు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగస్ట్ 15 లాంగ్ వీకెండ్ ఉన్న మంచి డేట్ కావడంతో ఆ ఛాన్స్ ను వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. అందుకే డబుల్ ఇస్మార్ట్ టీమ్ ఎంతో తెలివితో ఆ డేట్ ను లాక్ చేసుకుంటూ రిలీజ్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీంతో ఆ డేట్ లో వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమాగా డబుల్ ఇస్మార్ట్ కు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఎన్నో సార్లు పోస్ట్ పోన్ అయిన డబుల్ ఇస్మార్ట్ ను జులై లో రిలీజ్ చేయాలని టీమ్ చాలా ట్రై చేసింది. కానీ షూటింగ్ లేటవడం, ఓటీటీ డీల్ ఇంకా కుదరకపోవడం, సంజయ్ దత్ కాల్షీట్స్ వల్ల అది కుదరలేదు.
ప్రస్తుతం ఈ సినిమా కీలక షెడ్యూల్ జరుగుతుంది. టీజర్ కు వచ్చిన మిక్డ్స్ రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకుని ట్రైలర్ కట్ ఎంతో స్పెషల్ గా ఉండేట్లు చూస్తున్నారట. మణిశర్మ సంగీతంలోని లిరికల్ సాంగ్స్ ఈ నెలాఖరు నుంచి ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పుష్ప2 వాయిదా విషయాన్ని అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ పోస్టర్ తో పుష్ప2 వాయిదాని కన్ఫర్మ్ చేశారు. ది వారియర్, స్కంద సినిమాల తర్వాత చేస్తున్న ఈ సినిమాపైనే రామ్ తన ఆశలన్నింటినీ పెట్టుకున్నాడు. మరోవైపు పూరీ కూడా ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.













