వాయిదా దిశగా డబుల్ ఇస్మార్ట్?
రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా మార్చి 8ని రిలీజ్ డేట్ గా ఎప్పుడో లాక్ చేసుకుంది. సినిమాలను ఫాస్ట్ గా తీయడంలో ఎంతో నైపుణ్యం ఉన్న పూరీ కచ్ఛితంగా టార్గెట్ ను అందుకుంటాడని సినిమా మొదలుపెట్టినప్పుడు అనుకున్నారు.
కానీ ఈసారి అది వీలయ్యేలా కనిపించడం లేదు. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ మరో 40 రోజుల వరకు పెండింగ్ ఉందట. తొందరపడి సినిమాను హడావిడిగా చుట్టేయడం కంటే క్వాలిటీ మిస్ అవకుండా ఉంటే బెటర్ అని రామ్, పూరీ అనుకుంటున్నారట. అందుకే ఈ సినిమాను వాయిదా వేస క్వాలిటీ అవుట్పుట్ తో వద్దామనుకుంటున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
అలా కాకుండా అనుకున్న టైమ్ కే రావాలంటే వచ్చే నెల మూడో వారంలోపు షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రమోషన్స్ కు ఎంత లేదన్నా నెల రోజులైనా కావాలి. కాబట్టి అంత టైమ్ డబుల్ ఇస్మార్ట్ టీమ్ కు దొరకదు. లైగర్ డిజాస్టర్ కు ఈ సినిమాతో సమాధానం చెప్పాలని చూస్తున్న పూరీ ఈ సినిమాను చాలా కసితో తీస్తున్నట్లు తెలుస్తోంది. స్కందతో ట్రోలింగ్ కు గురైన రామ్ కు సైతం ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకం కానుంది.













