ఎట్టకేలకు దూతకు మోక్షం కలిగింది
దూత వెబ్ సిరీస్ తో మొదటిసారి ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు అక్కినేని నాగచైతన్య. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సరైన టైమ్ చూసుకుని ఈ వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేసేందుకు ప్రైమ్ వీడియో రెడీ అయింది.
సస్పెన్స్ థ్రిల్లర్ గా రానున్న ఈ సిరీస్‌లో నాగచైతన్య జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు. స్టోరీ భయంకరమైన మరణాల మిస్టరీ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. నాగచైతన్య ఇలాంటి థ్రిల్లర్ లో నటించడం ఇదే మొదటిసారి. ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్‌గా రానున్న దూతను శరత్ మరార్ నిర్మించాడు. డిసెంబర్ 1 నుంచి ఈ థ్రిల్లర్ డ్రామా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న నాగచైతన్య దూత సక్సెస్ గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే దూత సిరీస్ పై అందరికి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. దానికి తోడు విక్రమ్ లాంటి డైరెక్టర్ నుంచి వస్తున్న సిరీస్ కావడంతో దీనిపై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఈ సిరీస్ సక్సెస్ ఇటు చైతూకు, అటు విక్రమ్‌కు ఎంతో కీలకం కానుంది.













