Samantha: నాపై అలాంటి చెత్త కామెంట్స్ చేయొద్దు

గత కొన్నాళ్లుగా సౌత్ స్టార్ సమంత(Samantha) వార్తల్లో నిలుస్తూనే ఉంది. రీసెంట్ గా శుభం(Subham) సినిమాతో నిర్మాతగా మారి ఆ సినిమాతో హిట్ అందుకున్న సమంత, పలు వ్యక్తిగత విషయాల ద్వారా కూడా వార్తల్లోకెక్కింది. డైరెక్టర్ రాజ్ నిడుమోరు(Raj Nidumoru)తో సమంత రిలేషన్‌లో ఉందని, త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా వార్తలొస్తున్నాయి.
ఈ సంగతి పక్కన పెడితే, సమంత ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా క్యూట్ గా ఎంతో అందంగా ఉండేది. కానీ ఈ మధ్య మయోసైటిస్ తర్వాత సమంత ఆరోగ్యం క్షీణించి, ఫేస్ లో ఆ గ్లో తగ్గిందనేది వాస్తవం. అయితే ఈ విషయంలో కొంతమంది సమంతను ట్యాగ్ చేస్తూ సన్నబడ్డావు, ఆరోగ్యం బాలేదా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తారనే విషయం తెలిసిందే.
అయితే దీనిపై సమంత తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో సమంత జిమ్ లో పుల్ అప్స్ చేస్తూ కనిపించింది. ఇందులో చూపించినట్లు మీరు కనీసం మూడు పుల్ అప్స్ చేసేవరకూ సన్నబడ్డావు, హెల్త్ బాలేదా లాంటి చెత్త కామెంట్స్ తనపై చేయొద్దని, మీరు పుల్ అప్స్ చేయలేకపోతే ఇకపై ఆ విధంగా మాట్లాడకండని సమంత పోస్ట్ చేసింది.