డెవిల్కు ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం డెవిల్. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆయన నిర్మాణ బాధ్యతలు కూడా వ్యవహరించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా రిలీజైన డెవిల్ ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
పీరియాడికల్ మూవీగా వస్తోన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాకు ఇప్పుడో సెంటిమెంట్ పట్టుకుంది. హీరోయిన్ సంయుక్త మీనన్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ హిట్లుగానే నిలిచాడు. భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్షలతో హ్యాటిక్ హిట్స్ అందుకున్న సంయుక్త ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటుందని, సంయుక్త ఉంటే సినిమా హిట్టేనని అంటున్నారు.
బింబిసారతో మంచి హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్, ఆ తర్వాత చేసిన అమిగోస్ తో ఫ్లాప్ ను అందుకున్నాడు. దీంతో డెవిల్ సినిమాతో ఎలాగైనా తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు కళ్యాణ్ రామ్. పైన చెప్పుకున్నట్లు ఈ సినిమాకు సంయుక్త సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి డెవిల్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి. ఒకవేళ అదే జరిగితే టాలీవుడ్ లో అమ్మడి రేంజ్ పెరగడం ఖాయమనే చెప్పొచ్చు.













