నన్ను పెళ్లి ఎందుకు చేసుకున్నారంటే….
రామ్చరణ్, ఉపాసనలు చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ అన్యోన్యంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే త్వరలో వీరి వివాహ వార్షికోత్సవం రానుండడంతో హాలిడే టూర్ కోసం ఆఫ్రికా వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు వీరిద్దరూ. ఈ విహారయాత్రకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తోంది ఉపాసన. నన్ను రామ్చరణ్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఆమె చెప్పడం విశేషం. లయన్ సఫారీలో భాగంగా ఉపాసన సింహం పిల్లలతో ఎలాంటి భయం, బెరుకు లేకుండా ఆడుకొని తనలో ఎంత దైర్యం ఉందో తెలియజేసింది. అంతేకాదు ఇప్పుడు అర్థమైందా మిస్టర్ సి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారో అంటూ కామెంట్ చేసింది. తనలోని దైర్యం చూసి చరణ్ తనను పెళ్లి చేసుకున్నాడని ఆమె చెప్పింది.













