Uppena: ఉప్పెన కోసం మొదట అనుకున్నదెవరో తెలుసా?

ఇండస్ట్రీలో ఏ సినిమా ఎవరికి రాసి పెట్టి ఉంటే వారి వద్దకే వెళ్తుంది. ఒకరు చేయాల్సిన సినిమాల్ని మరొకరు చేయడం, ఆ విషయం తర్వాత బయటకు రావడం ఇండస్ట్రీలో చాలా మామూలే. బుచ్చిబాబు సాన(Buchi babu sana) దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ఉప్పెన(Uppena) ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
ఉప్పెన హిట్ తో కృతి శెట్టి(Krithi Shetty) కి వరుస సినిమా అవకాశాలు రాగా, ఆ హిట్ తోనే బుచ్చిబాబు రెండో సినిమానే ఏకంగా రామ్ చరణ్(ram Charan) తో చేస్తున్నాడు. వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) కూడా ఉప్పెన సినిమాతోనే డెబ్యూ చేశాడు. అయితే వాస్తవానికి ఈ సినిమాలో బుచ్చిబాబు మొదట అనుకున్న హీరో వైష్ణవ్ కాదట. ఉప్పెన కథ రాసుకుంటూనే హీరో కోసం వెతుకుతున్నప్పుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) అయితే కరెక్ట్ గా సరిపోతాడనుకున్నాడట.
కానీ విజయ్ అప్పుడే అర్జున్ రెడ్డి(Arjun Reddy)తో హిట్ అందుకోవడం వల్ల అలాంటి హీరోతో ఈ లవ్ స్టోరీ చేయించడం కరెక్ట్ కాదని అలాంటి లుక్స్ ఉన్న హీరోనే కావాలని వెతుకుతున్నప్పుడు సోషల్ మీడియాలో వైష్ణవ్ తేజ్ ఫోటో చూసి అతనే ఉప్పెనలో హీరో అని ఫిక్స్ అయి వైష్ణవ్ కు కథ చెప్పి ఉప్పెనను తీశాడట బుచ్చిబాబు. ఏదేమైనా విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమాను వైష్ణవ్ చేసి మంచి హిట్ అందుకున్నాడు.