నిహారిక పెండ్లి కానుకల విలువ ఎంతో తెలుసా?
టాలీవుడ్ నటుడు నాగబాబు కూతురు నిహారిక- చైతన్య జొన్నలగడ్డ వివాహ వేడుక రాజస్థాన్ ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. నిహారికకు రూ.2 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ పెండ్లి కానుకగా ఇచ్చినట్టు పెదనాన్న చిరంజీవి ఇప్పటికే వెల్లడించారు. తన ప్రియమైన వారికి అభిరుచులకు అనుగుణంగా బహుమతులు ఇస్తుంటాడు చిరు. వెడ్డింగ్ సమయంలో కూడా చిరు కొంత నగదును కూడా కానుకగా ఇచ్చాడట. చిరంజీవితో పాటు బన్నీ, రాంచరణ్, పవన్ కల్యాణ్ కూడా విలువైన కానుకలను అందించారు.
నిహారిక సోదరుడు వరణ్ తేజ్ ఖరీదైన గిఫ్ట్ ను అందించాడట. ఈ జాబితాలో సాయిధరమ్ తేజ్ కూడా చేరిపోయాడు. మొత్తానికి నిహారిక కొణిదెల తన పెండ్లి కానుకగా రూ.5 కోట్లకు పైగా విలువైన బహుమతులు అందుకున్నదట. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పెండ్లి అంటే ఈ మాత్రం గిఫ్ట్ లు సాధారణమేనని అంటున్నారు అభిమానులు.













