Divi: దీపావళి కాంతుల్లో మెరిసిపోతున్న దివి

టిక్ టాక్(tiktok) ద్వారా బాగా ఫేమస్ అయిన దివి(Divi), తర్వాత బిగ్‌బాస్(Biggboss) షో కు వెళ్లి దాంతో మరింత పాపులారిటీని దక్కించుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న దివి, ఓ వైపు సినిమాల్లో, మరోవైపు వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా తన అప్డేట్స్ ను షేర్ చేస్తూనే ఉంటుంది దివి. అందులో భాగంగానే తాజాగా దీపావళి సందర్భంగా దివి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గోల్డెన్ కలర్ లెహంగా, హెవీ ఎంబ్రాయిడరీ ఉన్న బ్లౌజ్ ధరించి దానికి సరిపోయే జ్యువెలరీతో ఎంతో అందంగా కనిపిస్తోంది దివి. ఈ లెహంగాలో దివిని చూసి చూడముచ్చటగా ఉందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.