టార్గెట్ అయిన డబుల్ ఇస్మార్ట్
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్, పూరీ ఇప్పుడు మరోసారి హిట్ కొట్టాలని డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి చూస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ ఇప్పటికే సినిమాకు ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారు. ఈ సినిమా సక్సెస్ విషయంలో పూరీ, రామ్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజవుతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు నెట్టింట కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఏ మేర నిజముందనేది తెలియదు కానీ డబుల్ ఇస్మార్ట్ కు డిస్ట్రిబ్యూషన్ విషయంలో కొన్ని ఇబ్బందులెదువుతున్నాయని అంటున్నారు. ఎగ్జిబిటర్లు లైగర్కు సంబంధించిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.
నైజాం ఏరియా ఎగ్జిబిటర్లకు రూ.8 కోట్ల వరకు రాయితీ ఇవ్వాలట. లీగల్ గా లయబులిటీ లేకపోయినా, థియేటర్ల యజమానులతో విభేదాలు తొలగించేందుకు ట్రై చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. నైజాంలోని థియేటర్ యజమానులంతా కలిసి ఇస్మార్ట్ సినిమాను ప్రదర్శించకూడదని డిసైడ్ తీసుకున్నట్లు ఒక ప్రచారం నడుస్తోంది. అయితే ఈ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వాస్తవానికి డిస్ట్రిబ్యూటర్స్ కు డబ్బులు ఇవ్వకపోతే డబుల్ ఇస్మార్ట్ థియేటర్లలో పడే ఛాన్స్ తక్కువే. ఇంత రచ్చ జరుగుతున్నా సినిమాపై హైప్ మాత్రం తగ్గడం లేదు. మరి రిలీజ్ తర్వాత ఈ సినిమా ఆడియన్స్ కు ఎంత మేర నచ్చుతుందో చూడాలి.













