దిశాను ఇప్పుడైనా లక్ వరిస్తుందా?
అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉన్నప్పటికీ దిశా పటానీకి ఇప్పటి వరకు రావాల్సిన గుర్తింపు రాలేదు. సక్సెస్ వచ్చినప్పుడు లక్ కలసిరాకపోవడం, లక్ ఉన్నప్పుడు సక్సెస్ దక్కకపోవడంతో దిశా ఇంకా అక్కడే ఆగిపోయింది. ప్రభాస్ తో దీపికా పదుకునే తో కలిసి కల్కి సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న దిశాకు మంచి సాంగ్స్ పడ్డాయని ఇప్పటికే యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
కల్కి హిట్ అయితే అమ్మడుకి టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కట్టడం ఖాయం. దీనికంటే ముందే సూర్య కంగువ సినిమా రానుంది. ఎప్పుడో 2015లో లోఫర్ సినిమాతో దిశాను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు పూరీ జగన్నాథ్. ఆ సినిమా డిజస్టర్ కావడంతో దిశాకు మంచి బ్రేక్ రాలేదు. తర్వాత ఎం.ఎస్ ధోనీ సినిమా చేసింది కానీ భాగీ2 వచ్చేవరకు దిశాకు మంచి బ్రేక్ దక్కలేదు.
ఆ తర్వాత కూడా తన జర్నీ సాఫీగా సాగలేదు. హిట్ల కంటే ఫ్లాపులే ఆమె ఖాతాలో ఎక్కువున్నాయి. ఇప్పుడిప్పుడే తిరిగి దిశా ట్రాక్ లో పడుతుంది. సిద్దార్థ్ మల్హోత్రాతో చేసిన యోధ సినిమా మార్చి 15న రిలీజ్ కానుంది. వెల్కమ్ టు ది జంగల్ నిర్మాణంలో ఉంది. చూస్తుంటే దిశా చేతిలో ఇప్పుడు మంచి ప్రాజెక్టులే ఉన్నాయి. వాటిలో ఏ రెండు మంచి టాక్ ను తెచ్చుకున్నా అమ్మడి దిశ తిరిగినట్లే.













