దిశా ప్రేమాయణానికి బ్రేక్
దిశా పటానీ మూడున్నరేళ్ల ప్రేమాయాణానికి బ్రేక్ పడింది. బాలీవుడ్ యంగ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో ఈ భామ రొమాన్స్ ముగిసిపోయింది. ఈ లవ్ బర్డ్స్ మూడున్నరేళ్ల పాటు గాఢమైన ప్రేమలో మునిగితేలారు. అయితే దిశా పటానీతో టైగర్ ఎఫైర్‌కు అతని తల్లి అడ్డ చెప్పిందని వార్తలొచ్చాయి. చివరికి ఇక కలిసి ఉండలేం.. కేవలం స్నేహితులుగా మాత్రమే కొనసాగాలని ఈ జంట ఓ నిర్ణయానికి వచ్చేసిందట. కొంత కాలంగా ఒకరితో ఒకరికి సరిపడడం లేదు. అభిప్రాయ విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. చిన్నపాటి గొడవలు తప్పలేదట. అయితే ప్రతిసారీ ఇద్దరు ఎంతో పరిణతితో వ్వవహరించారు. ఆ క్రమంలోనే టైగర్ ష్రాఫ్ ఇతర ఎఫైర్ వార్తలు దిశాని తీవ్రంగా భాదపెట్టాయి. ఈ క్రమంలోనే ఇద్దరూ విడిపోయారని తెలిసింది. ఇక కెరీర్ పరంగా చూస్తే టైగర్ ష్రాఫ్, దిశా ఇద్దరూ ఎవరికీ వారు బిజీ బిజీగా ఉన్నారు.













