భగవంత్ కేసరి రిలీజ్ విషయంలో చర్చలు
వీర సింహారెడ్డి సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా భగవంతి కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే నెల 19న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్టుగా చిత్ర యూనిట్ రిలీజ్ కు ప్రణాళికలు కూడా రెడీ చేసుకుంటుంది.
అయితే ఇప్పుడు సిట్యుయేషన్స్ ను బట్టి చూస్తుంటే ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సుందని తెలుస్తోంది. దానికి కారణం ఏపీ మాజీ సీఎం, బాలయ్య బావ చంద్రబాబు నాయుడు అరెస్ట్. ఆయన అరెస్ట్ తర్వాత బాలయ్య పార్టీ పనులతో పాటూ బాబుకు బెయిల్ తీసుకొచ్చే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటు వైపు చూస్తే భగవంత్ కేసరి రిలీజ్ డేట్ కు 20 రోజులు మాత్రమే టైమ్ ఉంది.
ఇలాంటి టైమ్ లో బాలయ్య మీడియా ముందుకొచ్చి సినిమాను ప్రమోట్ చేయలేడు. అలాగని బాలయ్య లేకుండా ప్రమోషన్స్ చేసి సినిమాను రిలీజ్ చేయడం కష్టం. బావ జైలులో ఉంటే సినిమాను రిలీజ్ చేశారని అనే అవకాశముంది. బాబుకి బెయిల్ వస్తే భగవంత్ కేసరి అనుకున్న టైమ్ కు రావడం ఖాయమని వార్తలొస్తున్న నేపథ్యంలో భగవంత్ కేసరి రిలీజ్ డేట్ ఏం మారలేదని మేకింగ్ వీడియోను వదిలి రిలీజ్ డేట్ ను మరోసారి గుర్తు చేశారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో భగవంత్ కేసరి రిలీజ్ లో మార్పు ఉండదని మేకర్స్ అఫిషియల్ గా చెప్పినట్లే లెక్క. ఇదిలా ఉంటే మరికొంత మంది బాబుకు బెయిల్ రాకపోతే కచ్ఛితంగా మూవీ పోస్ట్ పోన్ అవుతుందని జోస్యం చెప్తున్నారు.













