డిస్కో రాజా కు ముహూర్తం ఖరారు
మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న డిస్కోరాజా ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. తమన్ స్వరరచన చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ నెల 18 ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇంకా బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్నారు. పాయల్ రాజ్పుత్, నభానటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఛాయాగ్రహణం కార్తిక్ ఘట్టమనేని, సంభాషణలు అబ్బూరి రవి.













