4 నిమిషాలకు రూ.4.5 కోట్లు
రవితేజ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం డిస్కోరాజా. ఐ.వి.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. రవితేజ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లుగా చిత్ర టీం చెబుతుంది. ప్రస్తుతం విదేశాలకు వెళ్లేందుకు టీం రెడీ అవుతున్నట్లు నిర్మాత రామ్ తాళ్ళూరి తెలిపారు. యూరప్‌లోని ఐస్‌ల్యాండ్‌లో కొన్ని కీలక సన్నివేవాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేసినట్టు చెప్పారు. ఈ షెడ్యూల్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఐస్‌ల్యాండ్‌లో చేయబోతున్న కొన్ని కీలక సన్నివేశాల కోసం దాదాపు రూ.4.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17 నుంచి జరగబోతున్న షెడ్యూల్లో కీలక సన్నివేశం సినిమాలో కేవలం నాలుగు నిమిషాల నిడివి మాత్రమే ఉండటం కొస మెరపు. ఈ షెడ్యూల్లో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫాస్ట్ అండ్ పురియెస్ 7 కోసం పనిచేసిన యాక్షన్ స్టంట్ మాస్టర్స్, పలు ఇంటర్నేషనల్ సినిమాలకు పనిచేసిన ఊలి టీం డిస్కో రాజ కోసం రంగంలోకి దిగబోతున్నారు. సినిమాకి హైలైట్‌గా ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ చెబుతుంది. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యహోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.













